ఓ భావిత భారత భాగ్య విధాతలారా!
యువతి యువకులారా ఆ…
స్వానుభవమున చాటు నా.. సందేశమిదే వారేవా
తదిన్నా తకదిన్నా తం తకడితోం
పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్
రెల్లరు సుఖము చూడాలోయ్ మీ రెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి
కాపురములు కూల్చు గనులకు శాస్తికాగ
పట్నాల, పల్లెల, దేశదేశాల మనపేరు చెప్పుకుని ప్రజలు సుఖపడగా
తదిన్నా తకదిన్నా తంతకడితోం
ఇంటా బయట జంట కవులవలే అంటుకు తిరగాలోయ్ తర౦ప౦
ఇంటా బయట జంట కవులవలే అంటుకు తిరగాలోయ్
కంటిపాపలై దంపతులెప్పుడు చంటిపాపలను సాకాలోయ్
కంటిపాపలై దంపతులెప్పుడు చంటిపాపలను సాకాలోయ్
పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్
రెల్లరు సుఖము చూడాలోయ్ మీ రెల్లరు హాయిగ ఉండాలోయ్
నవ భావముల, నవ రాగముల ఆ…
నవ జీవనమే నడపాలోయ్
నవ భావముల, నవ రాగముల
నవ జీవనమే నడపాలోయ్
భావకవులవలే ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావకవులవలే ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్
రెల్లరు సుఖము చూడాలోయ్ మీ రెల్లరు హాయిగ ఉండాలోయ్
హాయిగ.. ఉండాలోయ్